Child Viral Video: తొలకరి జల్లులో ఎంజాయ్ చేస్తున్న చిన్నారి.! వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగలకు ఉపశమనంగా చిరు జల్లులు పలకరిస్తుండటంతో జనం ఊరట చెందుతున్నారు. ఇక తొలకరి జల్లులో తడుస్తూ ఓ చిన్నారి కేరింతలు కొడుతున్న వీడియోను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రుతుపవనాలు ఎట్టకేలకు ముంబైకి చేరుకోగా ఇంటి నుంచి తొలకరి జల్లులను ఆస్వాదించడం ఎలా ఉంటుందనేది ఈ వీడియో వెల్లడిస్తోందని ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. ప్రతి భారతీయుడి మదిలో ఉండే ఆలోచనే ఇది. చిన్నారి తొలకరి జల్లులను ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం అలిసిపోడంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట దూసుకెళ్తోంది. నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ముంబైలో వానాకాలం అంటే కేవలం వర్షాలే కాదు..ఓ ఫన్, హంగామా, చిన్ననాటి జ్ఞాపకాల అనుభూతులు అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, వర్షాకాలంలో ముంబై ఓ ఆటస్ధలంలా మారుతుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. చిన్నతనంలో వర్షపు నీటిలో కాగితపు పడవలు వేసి సందడి చేసే వారమని ఆ రోజులే అద్భుతమని మరో యూజర్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

