బెట్టింగ్‌ ప్రాణం తియ్యబోతే..సెల్‌ఫోన్‌ ప్రాణం కాపాడింది వీడియో

Updated on: Apr 05, 2025 | 6:12 PM

క్రికెట్‌ అభిమానులకు పండగ సీజన్‌ నడుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తుండటంతో బెట్టింగ్‌ రాయుళ్లకు సైతం కాసుల పంట పడుతోంది. సామాన్యుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ కాస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్‌ లో జరిగింది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కొన్ని రోజుల క్రితం ఉద్యోగం మానేశాడు.

క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటుపడిన అతను అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ ఆడాడు. ఈ క్రమంలో 3 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఇచ్చిన స్నేహితులు డబ్బు అడుగుతుండటంతో ముఖం చాటేశాడు. వారికి సమాధానం చెప్పలేక, ఇటు అప్పు చెల్లించలేక, ఇంటికి వెళ్లలేక తీవ్ర మనస్తాపం చెందాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 27 రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ చివరన పట్టాలపై పడుకున్నాడు. ఆ సమయంలో సోదరి గుర్తుకు రావడంతో.. ఆమెకు ఫోన్‌ చేసి క్రికెట్‌ బెట్టింగ్‌కు స్నేహితుల వద్ద అప్పు చేశానని అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ డబ్బు తాను చెల్లిస్తానని, ఆత్మహత్య చేసుకోవద్దని సోదరి నచ్చజెప్పింది. వారి మధ్య ఫోన్‌ సంభాషణ కొనసాగుతున్న సమయంలో ఒకటో నంబరు ప్లాట్‌ఫారంపై విధులు నిర్వహిస్తున్న జీఆర్పీ కానిస్టేబుల్‌ సైదులు, ఆర్పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌ కు స్టేషన్ చివరన సెల్ ఫోన్ వెలుగు కనిపించింది. అప్రమత్తమైన వారిద్దరూ వెంటనే ఇద్దరు అక్కడికెళ్లి చూడగా పట్టాలపై పడుకొని ఫోన్‌ మాట్లాడుతున్న వ్యక్తిని కనిపించాడు. వెంటనే అతన్ని ఠాణాకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వీడియోల కోసం :

టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో

టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?

తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్‌ కెమెరా వీడియో

ఖతర్నాక్‌ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో