Bulldozer-Woman: ఉత్తరప్రదేశ్‌లో కోడలి కాపురం నిలబెట్టిన బుల్డోజర్..! ఆలా ఉంటది మరి ఆడవాళ్ళూ అంటే..

|

Sep 05, 2022 | 9:07 AM

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో బుల్డోజర్‌ అంటేనే అక్రమార్కుల గుండెల్లో గుబులుపుడుతోంది. అక్రమ నిర్మాణాలపై బుల్డోజరు ప్రయోగం చేస్తున్నారు యూపీ అధికారులు. అదే బుల్డోజర్‌ను అత్తింటివారు లోనికి రానివ్వని

మహిళ కాపురం నిలబెట్టిన బుల్డోజర్‌..! - TV9
ఉత్తర్‌ప్రదేశ్‌‌లో బుల్డోజర్‌ అంటేనే అక్రమార్కుల గుండెల్లో గుబులుపుడుతోంది. అక్రమ నిర్మాణాలపై బుల్డోజరు ప్రయోగం చేస్తున్నారు యూపీ అధికారులు. అదే బుల్డోజర్‌ను అత్తింటివారు లోనికి రానివ్వని ఓ కోడలి కాపురాన్ని చక్కదిద్దేందుకూ ఎంచుకొని విజయం సాధించారు. బిజ్నోర్‌ జిల్లా ప్రొబేషన్‌ అధికారి రుబీ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. హల్దౌర్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని హరినగర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకొంది. నూతన్‌ మాలిక్‌ అనే మహిళకు అత్తింటి వారి వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఏకంగా ఆమెను అత్తవారింటి నుంచి గెంటివేశారు. దీంతో న్యాయం చేయాలంటూ ఆమె తండ్రి అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ బుల్డోజర్ కోడలిని ఇంట్లోకి చేర్పించింది. బ్యాంక్‌ మేనేజర్‌ అయిన రాబిన్‌సింగ్‌తో నూతన్ మాలిక్‌కు అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. కట్నం వేధింపులపై నూతన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2019 జూన్‌లో భర్తను అరెస్టు చేశారు. దీంతో ఆమెను అత్తింటివారు బయటకు గెంటేశారు. ఈ నేపథ్యంలో.. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు నూతన్‌ మాలిక్‌ను వెంటబెట్టుకొని ఆమె అత్తవారింటికి వెళ్లారు. తలుపులు తెరిచేందుకు వారు ససేమిరా అనడంతో.. పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతోఅధికారులు బుల్డోజరును రప్పించారు. దీంతో దిగివచ్చిన అత్తామామలు వెంటనే తలుపులు తెరిచి కోడలును ఇంట్లోకి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు నూతన్‌ అత్తవారింటిలోకి వెళ్లాక కూడా ఆమెకు పోలీసు రక్షణ ఉంటుందని ఏఎస్పీ ప్రవీణ్‌ రంజన్‌సింగ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 05, 2022 09:07 AM