British man: 21 కాక్ టెయిల్స్ తాగాడు.. ఆ తర్వాత కడుపునొప్పితో విలవిలలాడుతూ..?
కుటంబసమేతంగా జమైకాకు విహారయాత్రకు వెళ్లిన బ్రిటన్ వ్యక్తి బార్‌లో కాక్ టెయిల్ డ్రింకులు మోతాదుకు మించి తాగి అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందాడు. అసలేం జరిగిందంటే.. 53 ఏళ్ళ తిమోతి సదరన్ తన కుటుంబంతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు.
కుటంబసమేతంగా జమైకాకు విహారయాత్రకు వెళ్లిన బ్రిటన్ వ్యక్తి బార్‌లో కాక్ టెయిల్ డ్రింకులు మోతాదుకు మించి తాగి అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందాడు. అసలేం జరిగిందంటే.. 53 ఏళ్ళ తిమోతి సదరన్ తన కుటుంబంతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు.దగ్గర్లోని బార్‌కెళ్ళి మెనూలో 21 కాక్ టెయిల్ డ్రింకులు కనిపించే సరికి అత్యుత్సాహంతో అన్నిటినీ ఆర్డర్ చేసాడు. 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు.
కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకరు తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేస్తానంది కానీ ఆమె కబురు చేయలేదని ఈ లోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. పోలీసుల విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారని వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగినందువల్లే చనిపోయినట్లు వారు నిర్ధారించారు. అయితే అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలనే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

