Hyderabad: ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి.! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం తీస్తుందా..
పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పూరీలు గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి చెందిన సంఘటన బేగంపేట ఠాణా పరిధి లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిగూడకు చెందిన గౌతమ్ జైన్ కుమారుడు వీరేన్ జైన్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.
మధ్యాహ్నం 12.20 గంటలకు విరామ సమయంలో భోజనం చేస్తూ తన లంచ్ బాక్స్‌లో చుట్టలాగా చుట్టుకుని తీసుకొచ్చిన మూడు పూరీలను నోట్లో పెట్టుకుని తినేందుకు ప్రయత్నించాడు. దీంతో పూరీల చుట్ట గొంతులో ఇరుక్కొంది. వీరేన్ జైన్ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ కిందపడిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన బాలుడిని పాఠశాల సిబ్బంది హుటాహుటిన మారేడుపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం గొంతులో ఇరుక్కొన్న పూరీలను తొలగించారు. తండ్రి గౌతమ్ జైన్ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.