Bear Viral: అర్ధరాత్రి ఇళ్లల్లోకి ఎలుగుబంటి.. భయాందోళనలో గ్రామస్తులు. వీడియో వైరల్..

Updated on: Oct 21, 2023 | 9:31 PM

ఇటీవల తరచూ వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. రాత్రివేళ నగరాల్లోకి ప్రవేశించి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని బీసీ కాలనీలో అర్ధరాత్రి ఎలుగుబంటి స్వైర విహారం చేసింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు దాన్ని తరిమి వేసే ప్రయత్నం చేశారు.

ఇటీవల తరచూ వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. రాత్రివేళ నగరాల్లోకి ప్రవేశించి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని బీసీ కాలనీలో అర్ధరాత్రి ఎలుగుబంటి స్వైర విహారం చేసింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు దాన్ని తరిమి వేసే ప్రయత్నం చేశారు. స్థానికులు చేసిన శబ్ధాలకు ఎలుగుబంటి భయపడి పక్కనే ఉన్న తోటల్లోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణంలో ఎవరిపై దాడిచేస్తుందోనని వణికిపోయారు. గ్రామానికి సమీపంలోనే కొండలు ఉండటంతో అక్కడినుంచి ఎలుగుబంటి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఉపాధి కోసం స్థానికులు చుట్టుపక్కల తోటల్లో పని చేస్తుంటారు. ఇప్పుడు పొలాలకు, తోటలకు వెళ్లాలంటే భయం వేస్తుందని, ఎలుగుబంట్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని అటవిశాఖ అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..