Bangladeshi woman: ప్రియుడు పిలిచాడు.. ప్రేమ కోసమే దేశం వదిలి వచ్చేసింది ఈ మహిళా.. వీడియో.

|

Oct 29, 2023 | 9:26 PM

బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. అయితే ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఆమె రాగా అతను పరారయ్యాడు. త్రిపురలోని ధర్మానగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫుల్‌బరీలో నివసించే 34 ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. వివాహితుడైన అతడు తరచుగా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు వెళ్లేవాడు.

బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. అయితే ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఆమె రాగా అతను పరారయ్యాడు. త్రిపురలోని ధర్మానగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫుల్‌బరీలో నివసించే 34 ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. వివాహితుడైన అతడు తరచుగా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన 24 ఏళ్ల వివాహిత మహిళ ఫాతిమా నుస్రత్‌తో నూర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రేమలోపడ్డారు. ప్రియుడైన నూర్‌ను పెళ్లాడేందుకు బంగ్లాదేశ్‌ మహిళ ఫాతిమా నుస్రత్‌ 15 రోజుల కిందట అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ధర్మానగర్‌ చేరుకుంది. అనంతరం వారిద్దరూ ఫుల్‌బరీలో కలిసి ఉన్నారు. అయితే బంగ్లాదేశ్‌ మహిళ గురించి స్థానిక పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అరెస్ట్‌ చేసి 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. పరారీలో ఉన్న ప్రియుడు నూర్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..