125 Years Tortoise: జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రు జూ పార్క్ లో 125 సంవత్సరాల వయస్సు గల తాబేలు మృతి చెందింది. ఈ తాబేలుకు జూ పార్కులో ఎంతో ప్రత్యేకత ఉంది...రాక్షసుడు అనే పేరుగల ఈ మగ తాబేలుకు కొన్నేళ్లుగా జూ పార్క్‌తో విడతీయరాని బంధం ఉంది. ఈ శతాధిక తాబేలు కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో పది రోజులుగా ఎలాంటి ఆహారం కూడా తీసుకోవడం లేదు.
హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రు జూ పార్క్ లో 125 సంవత్సరాల వయస్సు గల తాబేలు మృతి చెందింది. ఈ తాబేలుకు జూ పార్కులో ఎంతో ప్రత్యేకత ఉంది…రాక్షసుడు అనే పేరుగల ఈ మగ తాబేలుకు కొన్నేళ్లుగా జూ పార్క్‌తో విడతీయరాని బంధం ఉంది. ఈ శతాధిక తాబేలు కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో పది రోజులుగా ఎలాంటి ఆహారం కూడా తీసుకోవడం లేదు. దాంతో ఆరోగ్యం మరింత క్షిణించిన ఈ తాబేలు శనివారం తుది శ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న జూ అధికారులతో పాటు గత కొన్నేళ్లుగా దానికి సేవలు చేసిన వారు భావోద్వేగానికి గురయ్యారు.! జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కును నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు… వివిధ రకాల జంతువులు,పక్షులను చూసేందుకు సుధార ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే విద్యార్ధుల సందర్శనతో పార్క్ కళకళలాడుతుంది. జూ పార్క్ లోకి వెళ్ళగానే మొదటగా కనిపించేది ఈ పెద్ద తాబేలు. ఇది చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోతారు…భారీ శరీరం తో చిన్న చిన్న అడుగులు వేస్తూ కదులుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇకపై ఈ తాబేలు జూపార్క్‌లో కనిపించదు. 1963 లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేలను జూ పార్కు తరలించారు అప్పటినుంచి ఈ రాక్షసుడు అనే తాబేలు జూ పార్క్ లోనే నివసిస్తుంది. జూ పార్క్ లోకి ఎవరు వచ్చినా ముందుగా ఈ భారీ తాబేలు చూసిన తర్వాతే మిగతా జంతువులు పక్షులను చూసేందుకు వెళుతుంటారు. దీంతో ఇకనుండి ఈ భారీ తాబేలు కనిపించదు అని విషయాన్ని తెలుసుకున్న పర్యాటకుల సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. ఇకపోతే తాబేలు జీవితకాలం 80 సంవత్సరాల నుంచి 150 ఏళ్ల వరకు ఉంటుంది ప్రస్తుతం ఈ రాక్షసుడు అనే తాబేలు అనారోగ్య కారణాలవల్ల 125 సంవత్సరాలకు తనువు చాలించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.