Ukrainian Grandmother: నేను సైతం.. తుపాకీ పట్టిన 79 ఏళ్ళ ఉక్రెయిన్ బామ్మ.. వైరల్‌గా మారిన వీడియో..
పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఉక్రెయిన్ దేశస్థులు అమలు చేస్తున్నారు. రష్యాపై యుద్ధంలో నేను సైతం అంటూ ఏకే 47 పట్టింది 79 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ.. వృద్ధురాలు వాలెంటినా కాన్‌స్టాంటినొవ్‌స్కా.. గన్ ను ఎలా పేల్చాలో శిక్షణ పొందారు.
పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఉక్రెయిన్ దేశస్థులు అమలు చేస్తున్నారు. రష్యాపై యుద్ధంలో నేను సైతం అంటూ ఏకే 47 పట్టింది 79 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ.. వృద్ధురాలు వాలెంటినా కాన్‌స్టాంటినొవ్‌స్కా.. గన్ ను ఎలా పేల్చాలో శిక్షణ పొందారు. ఈ మహిళ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.రష్యాతో జరుగుతున్న పోరులో ఉక్రెయిన్ దేశస్థులు మేము సైతం అంటూ.. ఆయుధాలు పట్టి కథన రంగంలోకి దిగుతున్నారు.. విజయమో.. వీరస్వర్గమో అన్న చందంగా రష్యా సేనలతో పోరాడుతున్నారు. అవును రష్యా సైన్యంపై ఉక్రెయిన్ పౌరులు దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపు మేరకు పౌరుల.. వయసుతో నిమిత్తం లేకుండా కదనరంగానికి ఉరుకుతున్నారు. ఏకే 47 పట్టిన మహిళలు కదన రంగంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మరికొందరు పెట్రోల్ బాంబులతో రష్యా ట్యాంకులపై దాడులు చేస్తుండగా.. వేలకొద్దీ పౌరులు ఆయుధాలు చేతబట్టి రష్యన్ దళాలను ఎదురిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే 18-60 ఏళ్ల పురుషులు ఉక్రెయిన్ వీడటంపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…