Viral: జైళ్ల నుంచి 700 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు పరార్‌.! వీడియో..

Viral: జైళ్ల నుంచి 700 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు పరార్‌.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 10, 2024 | 5:05 PM

ఈ ఏడాది జూలైలో బంగ్లాదేశ్‌ అట్టుడికింది. నాటి ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఫలితంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికీ ఆందోళనలు చల్లారనేలేదు. ఆ సమయంలో జైళ్లను బద్ధలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈవిషయాన్ని ఆ దేశ అధికారులే బుధవారం వెల్లడించారు.

నాటి ప్రధాని షేక్‌హసీనాపై తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఆందోళనల్లో దేశవ్యాప్తంగా 2,200 మంది ఖైదీలు తప్పించుకొన్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్‌ సయీద్‌ మహమ్మద్‌ మోతెర్‌ హోసైన్‌ ధ్రువీకరించారు. వీరిలో దాదాపు 1500 మందిని భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకొన్నాయని పేర్కొన్నారు. పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు వెల్లడించారు.

జులై 19న అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగిలోని జైలుపై వందల మంది దాడి చేసి నిప్పుపెట్టారు. అనంతరం పెద్దసంఖ్యలో ఖైదీలను విడిపించారు. ఆ తర్వాత వారాల్లో మరో నాలుగు జైళ్లపై కూడా దాడులు జరిగాయి. వీటిల్లో కరుడుగట్టిన నేరస్థులను ఉంచే కషిమ్‌పుర్‌ జైలు కూడా ఉంది. పోలీసుశాఖ ప్రతినిధి ఇమామ్‌ హోసైన్‌ సాగర్‌ మాట్లాడుతూ పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరి సమాచారం దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపామన్నారు. ప్రధాని హసీనా దేశం వీడిన తర్వాత బెయిలు పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.