వామ్మో.. ఇదెక్కడి వైద్యం.. దెబ్బ తగిలి ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్ చేసిన వింత పనికి అంతా షాక్
వైద్యో నారాయణ హరి అంటారు.. అంటే.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.. కానీ.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా చేస్తున్నారు.. తాజాగా.. ఓ వైద్యుడు చేసిన పనికి అంతా షాకవుతున్నారు. తల పగిలి ఆసుపత్రికి వస్తే.. ఫెవిక్విక్ తో అతికించేసి పంపించాడు.
వైద్యో నారాయణ హరి అంటారు.. అంటే.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.. కానీ.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా చేస్తున్నారు.. తాజాగా.. ఓ వైద్యుడు చేసిన పనికి అంతా షాకవుతున్నారు. తల పగిలి ఆసుపత్రికి వస్తే.. ఫెవిక్విక్ తో అతికించేసి పంపించాడు. ఈ షాకింగ్ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో చోటుచేసుకుంది. బాధిత బాలుడి తండ్రి వంశీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. బంధువుల ఇంట్లో పెళ్లి నిమిత్తం అయిజకు వచ్చారు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్ చౌదరి మే 4 రాత్రి పెళ్లి వేడుకలో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఎడమ కంటి పైభాగంలో గాయం కావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడికి లోతుగా గాయం అయినప్పటికీ.. వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా అక్కడున్న ఫెవిక్విక్‌తో అతికించేసి పంపించారు. అది గమనించిన బాలుడి తండ్రి ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను నిలదీశారు. దాంతో సిబ్బంది పొరపాటుగా చేశారని, బాలుడికి ఏమీ కాదని, ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని చెప్పారన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దెయ్యం కాళ్లతో గిన్నిస్ రికార్డ్ !! వీడియో చూస్తే షాకే
సూపర్ డాడ్.. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??
మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు !! ఎందుకో తెలుసా ??
తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసిన డాక్టర్‌కి షాక్ !!
The Kerala Story: 5రోజుల్లోనే 56 కోట్లు.. కేరళ స్టోరీస్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు