జాలరి పంట పండిందిగా.. వలలో చిక్కింది చూసి షాక్

Updated on: Aug 14, 2025 | 12:49 PM

బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లారు కొందరు మత్స్యకారులు. పడవల్లో నుంచి వలలు వేసి.. ఓపిగ్గా చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. వల ఒక్కసారిగా కిందికి పోవటంతో.. అనుమానం వచ్చి పైకి లాగేందుకు ప్రయత్నించారు. అయితే.. వల ఓ పట్టాన పైకి రాలేదు. దీంతో మరింత కష్టపడి లాగి చూసి.. ఒక్కసారి షాక్ అయ్యారు. తమ వలలో దాదాపు 500 కిలోలున్న సొరచేప పడటంతో ఒక్కసారి భయపడ్డారు.

సుమారు 5 గంటలు కుస్తీపట్టి.. ఆ వలలో పడిన చేపను ఒడ్డుకు చేర్చారు. చివరకు ఆ సొరచేపకు మంచి ధర పలకటంతో అప్పటివరకు పడిన కష్టమంతా మరిచి సంతోషంలో మునిగిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో చోటుచేసుకుంది. శనివారం అనకాపల్లి పూడిమడక తీరం నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ సొర చేప చిక్కింది. గాలానికి చిక్కిన సొరచేపను చూసి ముందు భయపడిన మత్స్యకారులు 5 గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొర చేపను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు.. దానిని పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి బయటకు లాక్కొచ్చారు. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొర చేపను పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ చూడలేదని తెలిపారు. దీన్ని వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారుడు నూకరాజు తెలిపాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే సరికొత్త ఆఫర్.. టికెట్ ధరలో రాయితీ

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక ఫోటోలన్నీ

వేరుశనగ గొంతులో ఇరుక్కొని మృతి.. శోకసంద్రంలో కుటుంబం