Nandyal: నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు.. పైకప్పు పగలగొట్టి మరీ మద్యం ఎత్తుకెళ్లిపోయారు.!
నంద్యాలలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉండే షాపులు, దేవాలయాల్లో హుండీలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా నిత్యం రద్దీగా ఉండే పద్మావతి నగర్ లోని ప్రభుత్వ లిక్కర్ మాల్ లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మాల్ పైకప్పు పగలగొట్టి వాటర్ పైప్‌ద్వారా క్రిందికి దిగి చోరీ చేసారు. దాదాపు ఐదు లక్షల విలువైన మద్యం ఎత్తుకెళ్లిపోయారు.
నంద్యాలలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉండే షాపులు, దేవాలయాల్లో హుండీలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా నిత్యం రద్దీగా ఉండే పద్మావతి నగర్ లోని ప్రభుత్వ లిక్కర్ మాల్ లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మాల్ పైకప్పు పగలగొట్టి వాటర్ పైప్‌ద్వారా క్రిందికి దిగి చోరీ చేసారు. దాదాపు ఐదు లక్షల విలువైన మద్యం ఎత్తుకెళ్లిపోయారు. మర్నాడు షాపు ఓపెన్ చేసిన సూపర్‌వైజర్ దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగుల అనవాళ్ళ కోసం క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. లిక్కర్ మాల్ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత రెండు నెలల కాలంగా వరస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో దొంగలు పెచ్చుమీరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..