అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో

Updated on: Sep 19, 2025 | 7:59 AM

బంధువు అంత్యక్రియలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయిన ఘటన అందరినీ కలిచి వేస్తుంది. వారి అంత్యక్రియలకు వెళ్లి, అంతిమ సంస్కారాలు ముగిసిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో గత శనివారం ఈ విషాద ఘటనలు జరిగాయి.

అసలేం జరిగిందంటే.. హరిద్వార్‌కు చెందిన ఓ వ్యక్తి శనివారం కారు ప్రమాదంలో మరణించాడు. కారు అదుపు తప్పి 16 అడుగుల లోతైన లోయలో పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో రెండు కుటుంబాలకు చెందిన ఆయన ఏడుగురు బంధువులు కారులో అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియల అనంతరం శనివారం రాత్రి వారు తిరుగు ప్రయాణమయ్యారు.జైపూర్‌లోని రింగ్‌ రోడ్డు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి నీటితో నిండిన అండర్‌పాస్‌లో పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని స్థానికులు రక్షించారు. ఆదివారం ఆ నలుగురి అంత్యక్రియలు బిల్వారా జిల్లాలోని వారి స్వగ్రామంలో జరిగాయి. అంత్యక్రియలకు వెళ్లిన వారిలో ఏడుగురు బంధువులు పక్కనున్న ఖారీ నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు వీడియో

విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో

సీనియర్ నటి రమాప్రభ అల్లుడు .. తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే వీడియో

సార్‌.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో

Published on: Sep 19, 2025 07:58 AM