వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా 271 రకాల వంటకాలు
సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ళ సందడి, అత్తారింటి విందులు గుర్తుకు వస్తాయి. ఆంధ్ర లోనే ఇటువంటి మర్యాదలు జరుగుతూ ఉంటాయి..ఇటీవల తెలంగాణ లో కూడా అల్లుడు కి మర్యాదలు జరుగు తున్నాయి. సాధారణంగా పండుగకు ఐదు లేదా పది రకాల పిండివంటలు చేయడం మనం చూస్తుంటాం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక అత్తామామలు తమ కొత్త అల్లుడిపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు.
ఏకంగా 271 రకాల వంటకాలతో అల్లుడికి రాచమర్యాదలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాల్వంచ పట్టణం హైస్కూల్ రోడ్డులో నివసించే గర్రె శ్రీనివాసరావు, పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు, దత్త రామకృష్ణతో ఇటీవల వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో, అల్లుడికి మర్చిపోలేని విందు ఇవ్వాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కేవలం కూరలు, పప్పులతోనే సరిపెట్టకుండా.. స్వీట్లు, హాట్లు, బేకరీ ఐటమ్స్, పండ్లు ఇలా అన్నింటినీ కలిపి 271 రకాలను సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ నిండా పళ్లాలలో అమర్చిన వంటకాలను చూసి అల్లుడు దత్త రామకృష్ణ ఆశ్చర్యపోయారు. తమపై చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ఆయన మురిసిపోయారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతోఅల్లుడంటే ఇలాంటి అత్తారింటికే వెళ్లాలి అంటూ స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!