ఒడిశావైపు దూసుకెళ్తున్న ఆటో.. పోలీసులు ఆపి చెక్‌ చేయగా షాక్‌

Updated on: Nov 27, 2025 | 4:44 PM

అల్లూరి జిల్లా చింతూరులో 248 అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెం నుంచి ఒడిశాకు తీసుకెళ్తుండగా ఆటోను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. 18 తాబేళ్లు మృతి చెందగా, మిగిలిన 230ని తిరిగి విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఓ ఆటో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒడిశా వైపు దూసుకెళ్తోంది. ఇద్దరు వ్యక్తులు ఆ ఆటోలో ఏదో లోడు తీసుకెళ్తున్నారు. సాధారణంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ ఆటో అనుమానాస్పదంగా అనిపించింది. వెంటను ఆటోను పక్కకు ఆపారు పోలీసులు. ఆటోలో ఏం తీసుకెళ్తున్నారు..ఎక్కడినుంచి వస్తున్నారు అంటూ ఆరా తీశారు. ఆ ఇద్దరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆటోను క్షుణ్ణంగా చెక్‌ చేయగా అందులో ఓ ప్రత్యేక అర కనిపించింది. అందులో అరుదైన తాబేళ్లు కనిపించాయి. పోలీసులకు సీన్‌ అర్ధమైంది. తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీలో జరిగింది. రావులపాలెం నుండి ఒడిశాకు 248 తాబేళ్లను గోనె సంచుల్లో మూటలు కట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చింతూరు మండలం తులసిపాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తాబేలును తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ తాబేళ్లలో 18 తాబేళ్లు మృతి చెందగా మిగిలిన 230 తాబేళ్లను సోకిలేరు వాగులో విడిచిపెట్టారు. అక్రమంగా తాబేళ్లను తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తాబేళ్లు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరి కోసం తరలిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం