తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు !! ఆందోళనలో పర్యావరణ వేత్తలు !!
ఆస్ట్రేలియాలోని టాస్మానియా దక్షిణ తీరానికి సుమారు 230 పైలట్ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. వీటిలో దాదాపు సగం వరకు బతికే ఉన్నాయని టాస్మానియా పర్యావరణ, సహజ వనరుల శాఖ వెల్లడించింది. వీటిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేసింది. ఒకే రకమైన తిమింగలాలు ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో చిక్కుకు పోవడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో కూడా ఇదే ప్రదేశంలో దాదాపు 500 పైలట్ తిమింగలాలు చిక్కుకుపోయాయి. అప్పట్లో వాటిల్లో 380 చనిపోగా […]
ఆస్ట్రేలియాలోని టాస్మానియా దక్షిణ తీరానికి సుమారు 230 పైలట్ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. వీటిలో దాదాపు సగం వరకు బతికే ఉన్నాయని టాస్మానియా పర్యావరణ, సహజ వనరుల శాఖ వెల్లడించింది. వీటిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేసింది. ఒకే రకమైన తిమింగలాలు ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో చిక్కుకు పోవడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో కూడా ఇదే ప్రదేశంలో దాదాపు 500 పైలట్ తిమింగలాలు చిక్కుకుపోయాయి. అప్పట్లో వాటిల్లో 380 చనిపోగా మిగిలినవాటిని రక్షించారు. ఇటీవల ఆగ్నేయ తీరానికి 14 స్పెర్మ్‌వేల్స్ కొట్టుకువచ్చాయి. ఇది చాలా అరుదని శాస్త్రవేత్తలు తెలిపారు. వేడి వాతావరణం వల్ల సముద్ర వడి మారుతోందని, తిమింగలాల సంప్రదాయ ఆహార వనరులు లభించే దిశ కూడా మారుతున్నట్లు వెల్లడించారు. ఆహార అన్వేషణలోనే ఇవి ఒడ్డుకు కొట్టుకువస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి !! తర్వాత ఏం జరిగిందంటే ??
కుండలు చేస్తున్న పిల్లి.. ఎలాగో తెలుసా ?? వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
అదృష్టవంతులు.. చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్‌లో కరెన్సీ నోట్ల కట్టలు !!
కార్లు క్లీన్ చేసుకునేవ్యక్తిని వరించిన అదృష్టం.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు
విమాన సిబ్బందిపై ప్యాసింజర్ దాష్టీకం !!