Viral Video: పురాతన శివాలయంలో అద్భుతం.. తవ్వకాల్లో 22 పంచలోహ దేవతా విగ్రహాలు..
తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో పెద్ద సంఖ్యలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటీ రెండు కాదు. ఏకంగా 22 విగ్రహాలు ఆలయంలోని తవ్వకాల్లో బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లాలోని శీర్గాళిలో చటగట్నాథన్ దేవాలయంలో
తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో పెద్ద సంఖ్యలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటీ రెండు కాదు. ఏకంగా 22 విగ్రహాలు ఆలయంలోని తవ్వకాల్లో బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లాలోని శీర్గాళిలో చటగట్నాథన్ దేవాలయంలో మూడు దశాబ్దాల తర్వాత కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అందులో భాగంగా యాగశాలకోసం దేవాలయంలోని ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. యాగశాల కోసం ఆలయంలోపల తవ్వకాలు జరుపుతుండగా ఏకంగా 22 దేవతా మూర్తుల విగ్రహాలు బయటపడ్డంతో అంతా ఆశ్చర్యపోయారు. 30 ఏళ్ళ తరువాత తలపెట్టిన కుంభాభిషేకానికి ఆలయంలో మరమ్మతుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలన్నీ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలే కావడం విశేషం. అంతేకాదు… విగ్రహాలన్నీ రెండడుగుల ఎత్తులోనే ఉన్నాయి. వీటికి తోడు వందలకొద్దీ రాగిరేకులు, ఇతర పూజాసామాగ్రి తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ విగ్రహాల గురించి పురావస్తు శాఖకు సమాచారమిచ్చారు ఆలయ అధికారులు. ఈ పురాతన శివాలయంలో బయపటడ్డ విగ్రహాలు ఏకాలానికి చెందినవో.. వాటి చరిత్ర ఏమిటో తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

