Elephants: హాయ్ ఫ్రెండ్స్.. ఊరికే అలా సరదాగా వచ్చాం.. డోంట్ డిస్టర్బ్. వైరల్ అవుతున్న ఏనుగు వీడియో.
చిత్తూరు, తిరుపతి జిల్లాలవాసులను గత కొద్ది రోజులుగా గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఏనుగుల గుంపు కలకలంరేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏనుగులు
చిత్తూరు, తిరుపతి జిల్లాలవాసులను గత కొద్ది రోజులుగా గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఏనుగుల గుంపు కలకలంరేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏనుగులు జాతీయ రహదారిపై సందడి చేశాయి. దీంతో రైతులు, స్థానికులు భయంతో వణికిపోతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు సమీపంలో గజరాజులు రోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు భయంతో వణికిపోయారు. ఇటీవల కాలంలో సమీపంలోని అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. పంటపొలాలను ధ్వంసం చేస్తూ రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఏవైపు నుంచి ఎలా వచ్చాయో తెలియదు కానీ.. మొత్తం 22 ఏనుగులు ఒకేసారి రోడ్డుపైకి వచ్చేశాయి. రోడ్డుపక్కనే కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కంచెదాటి అడవిలోకి వెళ్లలేక రోడ్డుపైనే చాలాసేపు ఉండిపోయాయి గజరాజులు. అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల గుంపును తరమలేక.. చూస్తూ ఉండిపోయారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు స్థానికులు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. గజరాజులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరిమివేశారు. అయితే ఇంత పెద్దసంఖ్యలో ఏనుగులు గుంపుగా సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గజరాజులు తమ ఊరిపై ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
