Hasanamba Temple: హసనంబ ఆలయంలో తొక్కిసలాట.. 20 మంది భక్తులకు కరెంట్‌ షాక్‌.

|

Nov 11, 2023 | 6:26 PM

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్‌ కు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. హసనాంబ ఆలయం ఏడాదిలో వారం రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్‌ కు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. హసనాంబ ఆలయం ఏడాదిలో వారం రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఏటా దీపావళికి ఏడు రోజులు ముందు ఆలయాన్ని తెరుస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా లాగే ఈ ఏడు కూడా ఆలయంలో నవంబర్‌ 2వ తేదీ నుంచి వార్షిక హసనాంబ జాతర మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవం నవంబర్‌ 14తో ముగియనుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ సందర్శనకు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం మధ్యాహ్నం క్యూలో నిల్చున్న సమయంలో విద్యుత్‌ తీగ తెగి పడటంతో 20 మంది భక్తులు కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన భక్తులు క్యూ నుంచి బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యారు. వెంటనే స్పందించిన ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని హసన్‌ ఎస్పీ మహ్మద్‌ సుజిత తెలిపారు. ఈ హసనాంబ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయాన్ని మూసే ముందు నెయ్యితో దీపం వెలిగిస్తారు. రెండు బస్తాల బియ్యం, నీరు పెట్టి ఆలయ తలుపుల్ని వేసేస్తారు. ఆ నెయ్యి దీపం తిరిగి ఆలయ తలుపులు తెరిచే వరకూ వెలుగుతూనే ఉంటుందట. పువ్వులు కూడా వాడిపోవని.. దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్నం కూడా వేడిగానే ఉంటుందని స్థానికులు చెబుతారు. అది కూడా తినడానికి అనుకూలంగానే ఉంటుందని, ఆలయ తలుపులు తెరిచిన తర్వాత ఆ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారని అంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.