తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
17 ఏళ్ల అమన్ తన తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పులను తీర్చి, గొప్ప కొడుకుగా నిలిచాడు. కష్టపడి సంపాదించిన డబ్బుతో అమ్మ రుణం తీర్చిన ఈ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తల్లి ప్రేమకు కృతజ్ఞతగా, భావోద్వేగంగా అప్పులు చెల్లిస్తూ, భవిష్యత్తులోనూ తన తల్లిని చూసుకుంటానని అమన్ మాట ఇచ్చాడు. ఈ హృదయపూర్వక సంఘటన కోట్లాది మందికి స్ఫూర్తినిస్తోంది.
మీ తల్లిదండ్రులకు లక్షల రూపాయల అప్పులు ఉన్నాయా? ఆ అప్పులను మీరు తీర్చగలరా? “వారు చేసిన అప్పులను నేనెందుకు తీర్చుతాను” అని వదిలేసేవారే చాలా మంది ఉంటారు. అందులోనూ టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల అప్పుల గురించి అస్సలు పట్టించుకోరు. తల్లిదండ్రుల బాధ గురించి పట్టించుకోరు. అలాంటిది ఓ 17 ఏళ్ల కుర్రాడు తన తల్లికి ఉన్న సుమారు రూ.12 లక్షల అప్పులను తీర్చేశాడు. అంత డబ్బును అంత చిన్న వయసులో కష్టపడి సంపాదించి తీసుకొచ్చి అమ్మకు ఇచ్చాడు. ఈ డబ్బుతో ఆమెకున్న అప్పులన్నీ తీర్చాలని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అమన్ తన తల్లితో మాట్లాడుతూ.. ఐ లవ్యూ అమ్మా అని అంటాడు. కొంతకాలంగా తన తల్లికోసం ఓ పని చేయాలనుకుంటున్నానని చెబుతాడు. దీంతో అతడి తల్లి ఎంతో ఉత్కంఠతో, భావోద్వేగంతో చూస్తుంది. తన కోసం ఆమె చేసిన ప్రతి విషయానికి అమన్ కృతజ్ఞతలు తెలుపుతాడు. తన జీవితంలో ఆమెనే “అత్యంత ప్రత్యేకమైన మహిళ” అంటాడు. భావోద్వేగానికి లోనైన తల్లి.. “ఐ టూ లవ్యూ, నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు” అని స్పందిస్తుంది. అనంతరం అమన్ ఆమెను కళ్లు తెరవాలని కోరుతూ డబ్బు అందచేస్తాడు. “ఇది నీకున్న అప్పులన్నీ తీర్చడానికి. ఇక నుంచి ప్రతి నెల నీ బిల్లులన్నీ నేను చూసుకుంటాను. మాట ఇస్తున్నాను” అని చెబుతాడు. భావోద్వేగంతో తల్లి కన్నీళ్లు పెట్టుకుని అతడిని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది. తన అమ్మ తన కోసం చేయగలిగిన ప్రతిదీ చేసిందనీ చివరికి తను ఆమెను చూసుకునే స్థితికి రావడం తనకు చాలా ఆనందం, గర్వం అనీ దీన్ని నేను మాటల్లో చెప్పలేననీ అమన్ అన్నాడు. ఈ క్షణం రావాలని చాలాసార్లు అనుకున్నాననీ ప్రయత్నం ప్రారంభించిన ఏడాది తర్వాత తన కల నిజమైందనీ దేవుడికి, అమ్మకు థ్యాంక్స్ అని అమన్ అన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో రైతులందరికీ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్