1500 kg Fish: వామ్మో! 1500 కిలోల భారీ చేప.. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.

|

Jul 30, 2024 | 9:05 PM

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారి పాలిట బంగారు బాతులవుతాయి. మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బాహుబలి చేపను చూసి వారంతా షాకయ్యారు. దాన్ని నీళ్లల్లోంచి ఒడ్డుకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో క్రేన్‌ తీసుకొచ్చారు. చివరకు ఆ క్రేన్ సాయంతో బాహుబలి చేపను బయటకు తీసుకొచ్చారు. చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు.

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారి పాలిట బంగారు బాతులవుతాయి. మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బాహుబలి చేపను చూసి వారంతా షాకయ్యారు. దాన్ని నీళ్లల్లోంచి ఒడ్డుకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో క్రేన్‌ తీసుకొచ్చారు. చివరకు ఆ క్రేన్ సాయంతో బాహుబలి చేపను బయటకు తీసుకొచ్చారు. చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. మచిలీపట్నం గిలకలదిండికి చెందిన మత్స్యకారుల బృందం సముద్రంలో వేటకు వెళ్లింది. సముద్రంలో వల వేసి చేపలు పడుతున్న వారి వలలోకి భారీ చేప చిక్కింది. దాని బరువు 1500 కిలోలు. సముద్రంలో వలలు విసరగా, అందులో ఏదో బరువైన వస్తువు చిక్కుకుపోయినట్లు మత్స్యకారులు గమనించారు. వారు దానిని పైకి లాగినప్పుడు, వారి వలలో చిక్కుకున్న ఒక భారీ చేపను చూసి వారు ఆశ్చర్యపోయారు. చేప భారీగా బరువు ఉన్నప్పటికీ, మత్స్యకారులు దానిని ఒడ్డుకు చేర్చగలిగారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on