Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 15 మంది అమ్మాయిలను.. వీడియో వైరల్.

|

Jul 15, 2023 | 7:22 PM

వివాహం పేరుతో మహిళలను వంచిస్తూ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని, వారి నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్న ఓ నిత్య పెళ్లి కొడుకును మైసూరు కువెంపురా నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. అవును ఈ నిత్య పెళ్లికొడుకు ఏకంగా 15 మందిని వివాహమాడాడు. ఆ తర్వాత భార్యలనుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం,

బెంగళూరులోని బనశంకరికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి మైసూరుకు చెందిన హేమలతని మహేష్ షాదీ డాట్ కామ్‌ అనే వెబ్‍సైట్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తానొక డాక్టర్‌నని, స్థానికంగా ఉన్న విజయనగరలోనే తాను ఉంటున్నట్లు హేమలతను నమ్మించాడు. జనవరిలో విశాఖలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం మైసూరుకు వచ్చి కాపురం పెట్టారు. అయితే ఓ క్లినిక్‌ స్టార్ట్ చేస్తున్నానని, అందుకు పెట్టుబడిగా 70 లక్షలు కావాలని హేమలతను అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనూ చడీచప్పుడు కాకుండా బీరువాలో ఉన్న 15 లక్షలతో పాటు విలువైన బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. భర్త తిరిగి వస్తాడని అనుకున్న ఆమెను దివ్య అనే మరో మహిళ కలిసింది. మహేశ్‌ తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడని వివరించడంతో వెంటనే వారిద్దరు కువెంపునగర పోలీస్ స్టేషన్‎లో కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని బెంగళూరులో అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు ఇదే తరహాలో మరో 15 మందికి పైగా మహిళలను మోసం చేశాడని, కొందరిని వివాహం చేసుకుని, మరికొందరితో నిశ్చితార్థం పూర్తయిన తర్వాత నగదు, నగలతో పరారైనట్టు గుర్తించామని చెప్పారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం సామాజిక మాధ్యమాలు, మాట్రిమోని వెబ్‌సైట్లను ఆశ్రయించే వారు ముందుగా పూర్వాపరాలను విచారించాకే ముందుకు వెళ్లాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...