Telangana: ఆ కలెక్టర్ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయా?

|

Aug 13, 2023 | 7:27 PM

ఇన్ని సంవత్సరాలో ఎన్నోసార్లు ప్రకృతి విపత్తులు వచ్చాయి అయినా ఆ భవనం చెక్కుచెదరలేదు. వరంగల్‌లో ఈ బంగ్లా ఓ ఐకాన్ ల్యాండ్ మార్క్. దీని నిర్మాణం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఆనాటి రాచరికపు తీపి గుర్తులు ఎన్నో ఇందులో కనిపిస్తాయి. దీని కోసం డంగుతో సున్నం వినియోగించారు. బిల్డింగ్ బయటకు ఎంత అందంగా వుంటుందో, లోపల కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు మొత్తం 42 మంది కలెక్టర్లు నివాసం ఉన్నారు.

వరంగల్ అంటేనే.. చారిత్రక కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలం దగ్గర నుంచి నిజాం పాలకుల వరకు నిర్మించిన ఎన్నో చారిత్రక, అద్భుత కట్టడాలు కళ్లముందు సాక్షాత్కరిస్తుంటాయి. వరంగల్ పరిసరాల్లో ఎన్నో ప్రత్యేక భవంతులు ఉన్నా.. సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా హంగు, ఆర్భాటాలు ప్రత్యేకం. ఘన చరిత్రకు సాక్ష్యాలుగా, కళాకారుల అద్భుత పనితనానికి నిదర్శనంగా, గత వైభవానికి సాక్ష్యంగా నిలిచి ఉన్న.. ఈ బంగ్లా 137 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులో దెయ్యం ఉందనే వదంతులు కూడా ఉన్నాయి. మరి ఇందులో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? 42 మంది కలెక్టర్లకు నిలయంగా మారిన ఈ బంగ్లా ప్రస్తుతం ఎలా ఉంది?