విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కుని ఆప్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన బాలుడు

Updated on: Sep 24, 2025 | 1:56 PM

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఓ దుస్సాహసం చేసాడు. కాబూల్ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంలోకి ఎవరూ చూడకుండా ఎక్కేశాడు. విమానంలోని ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని గంటల పాటు అక్కడే ఉండిపోయాడు. విషయం తెలియని సిబ్బంది విమానాన్ని కాబూల్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. అలా బాలుడు ఢిల్లీ చేరుకున్నాడు.

కేఏఎం విమానయాన సంస్థకు చెందిన విమానం ఆదివారం అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరింది. దాదాపు రెండు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా దిగిపోయాక.. బాలుడు మాత్రం విమానం వద్దే తచ్చాడుతూ కనిపించాడు. సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అతడిని అదుపులోకి తీసుకుంది. అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు, నీవు ఎవరితో ఇక్కడకొచ్చావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బాలుడు తాను అఫ్గాన్‌లోని కుందూజ్ నగర్‌కు చెందిన వాడినని చెప్పగా షాక్ అయ్యారు. ముఖ్యంగా అతడు ఒంటరిగానే విమాన ప్రయాణం చేసినట్లు చెప్పగా విస్తుపోయారు. పాస్‌పోర్ట్ సహా మిగతా పత్రాలు చూపించమనగా.. అవేమీ తన దగ్గర లేవన్నాడు. మరి విమానంలో ఎలా ప్రయాణించావని అడగ్గా.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కొని వచ్చినట్లు చెప్పాడు. అక్కడే కొన్ని గంటల పాటు ఉండి.. విమాన ప్రయాణం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా ఎవరైనా చేయమన్నారా, నీ చేత ఎవరు చేయించారో వారి పేర్లు చెప్పమంటూ సెక్యూరిటీ సవాలక్ష ప్రశ్నలు సంధించారు. తనకెవరూ చెప్పలేదని.. విమాన ప్రయాణం అంటే ఇష్టం కావడం వల్లే ఇలా చేశానని అన్నాడు. దీంతో CISF అతడిని తిరిగి అదే విమానంలో వెనక్కి పంపించారు. అలా ఈ కథ సుఖాంతం అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాన్స్‌ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్‌.. సీన్ కట్ చేస్తే..

Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!

ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం

శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్

వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ