చనిపోయాడని నదిలో నిమజ్జనం.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి.. ఏం జరిగింది

Updated on: Oct 28, 2025 | 1:10 PM

ఉత్తర్‌ప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా టిక్రి గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు పాము కాటుతో చనిపోయాడని అంతా భావించారు. అయితే..అతడు ఎవరూ ఊహించని రీతిలో 13 ఏళ్ల తర్వాత మళ్లీ తన కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. 13 ఏళ్ల క్రితం పాము కాటేసిన దీపును కుటుంబ సభ్యులు ని పాముకాటు చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే దీపు మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.

దీంతో ఒక్కసారిగా బాలుడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత దీపు మృతదేహాన్ని బ్రజ్​ఘాట్‌లోని గంగానదిలో నిమజ్జనం చేశారు. అయితే దీపు మరణాన్ని అతడి తల్లి సుమన్ దేవీ జీర్ణించుకోలేకపోయింది. కొన్నాళ్ల పాటు కన్నీరు మున్నీరుగా రోదించింది. పాముకాటుతో మరణించిన వారిని మూలికా వైద్యంతో పాములు పట్టేవారు బతికిస్తారని గతంలో ఆమెకు ఎవరో చెప్పారు. దీంతో.. ఆమె భర్తతో పాల్వాల్​లోని బెంగాలీ బాబా ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ తన కొడుకును పోలిన ఒక యువకుడిని ఆమె గమనించారు. అనుమానం వచ్చి.. అతడి చెవి వెనుక గుర్తును పరిశీలించగా.. అచ్చు అది తన కొడుకుకున్న గుర్తులాగే అనిపించింది. దీంతో, ఆమె ఆశ్రమ సిబ్బందిని కలిసి ఆ యువకుడి వివరాలు అడిగారు. కాగా, 13 ఏళ్ల క్రితం ఓ బాలుడు గంగా నదిలో కొట్టుకుపోతుంటే.. తాము కాపాడి మూలికా వైద్యం చేసి బతికించామని ఆశ్రమంలోని వారు తెలిపారు. దీంతో ఎగిరి గంతేసిన.. దీపూ తల్లిదండ్రులు.. అతడు తమ కుమారుడేనని నాటి ఘటనను పూసగుచ్చినట్లు వివరించారు. తమ కుమారుడిని తమతో పంపాలని ఆశ్రమంలోని మంత్రగాళ్లను వేడుకున్నారు. అయితే.. దానికి వారు నిరాకరించారు. అయితే,కొన్ని మతపరమైన విశ్వాసాల ప్రకారం.. ఇప్పుడే అతడిని ఇంటికి పంపలేమని, ఏడాది తర్వాత అతడిని పంపటానికి తమకు అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. అనుకున్న ప్రకారమే.. ఏడాది తర్వాత ఇటీవలే దీపూను పాల్వాల్ ఆశ్రమవాసులు ఇంటికి తెచ్చి దిగబెట్టారు. దీంతో..బంధువులు, గ్రామస్తులంతా సంతోషంలో మునిగిపోయారు. 13 ఏళ్ల క్రితం తప్పిపోయిన దీపు వయసు బాలుడిగా తప్పిపోయిన దీపు ఇప్పుడు యువకుడిలా మారి ఇంటికి తిరిగిరావడం ఆశ్చర్యకరమే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డీమ్యాట్ ఖాతాలో రూ. 2,817 కోట్ల సంపద.. కాసేపటికే అంకెలన్నీ మాయమై

చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్‌ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్