మహారాష్ట్రలో ఒక బాలుడు మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు నాసిక్ జిల్లా మాలేగావ్‌లోని వెడ్డింగ్ హాల్ ఆఫీస్‌లో 12 ఏళ్ల మోహిత్ అహిరే మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ రూమ్‌లోకి ప్రవేశించింది. చిరుతను చూసి మోహిత్ అహిరే తొలుత భయపడ్డాడు. అయితే ఆ బాలుడు వెంటనే తెలివిగా వ్యవహరించాడు. మెల్లగా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే డోర్ లాక్ చేశాడు. తండ్రి వద్దకు వెళ్లి చిరుత సంగతి చెప్పాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ చిరుతను బంధించారు. మరోవైపు ఆ బాలుడు చాకచక్యంగా చిరుత బారి నుంచి తప్పించుకుని దానిని బంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..
అతడి ఆచూకీ చెప్పినవారికవ ₹10లక్షలు..
డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి
ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు