మత్స్యకారుల పంటపండింది.. వలలో పడ్డ అతిపెద్ద చేప..

|

Jan 01, 2024 | 3:11 PM

కాకినాడలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. వలలో అతిపెద్ద కొమ్ముకోణం చేప పడింది. న్యూఇయర్‌ సమీపిస్తున్న వేళ వలలో పడిన భారీ చేపను చూసిన మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2023 వ సంవత్సరం వెళ్తూ వెళ్తూ తమ ఇంట సిరులు కురిపించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి.

కాకినాడలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. వలలో అతిపెద్ద కొమ్ముకోణం చేప పడింది. న్యూఇయర్‌ సమీపిస్తున్న వేళ వలలో పడిన భారీ చేపను చూసిన మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2023 వ సంవత్సరం వెళ్తూ వెళ్తూ తమ ఇంట సిరులు కురిపించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి. ఇటీవలే ఇక్కడి మత్స్యకారులకు 200 నుంచి 400 కిలోల బరువైన చేపలు వలకు చిక్కాయి. తాజాగా అంతకు మించి అన్నట్టుగా ఏకంగా 15 అడుగుల పొడవుతో 1000 కిలోల బరువైన అతిపెద్ద కొమ్ముకోణం చేప చిక్కింది. మత్స్యకారులంతా కలిసి దానిని కుంభాభిషేకం రేవు వద్దకు తరలించారు. చేపను వేలానికి పెట్టగా దానిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. స్థానిక వ్యాపారి ఒకరు ఈ చేపను 36 వేల రూపాయలకు దక్కించుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాగొచ్చిన కానిస్టేబుల్…స్టేషన్లో ఏం చేశాడో తెలుసా ??

వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విశేషాలివే

నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్‌.. దానిపైనే విమానం ల్యాండింగ్

అయోధ్యకు 620 కిలోల గంట.. దానిపై జై శ్రీరామ్ అని రాసి ఉండటం దీని ప్రత్యేకత