విజయవాడలో మహా మట్టి గణపతి.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో
అద్భుతం, కమనీయం, సుందరాకృతితో చూసినంతనే తన్మయత్వము చేస్తున్న ఆ భారీ గణపతి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఈ ఏడాది సైతం 72 అడుగుల మట్టి గణపతి విజయవాడలో పూజలకు సిద్ధమవుతున్నాడు. విజయవాడలో భారీ మట్టి గణపతి విగ్రహం బొజ్జ గణపయ్య నవరాత్రులకు వేలైంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు నెలకొన్నాయి. విభిన్న సైజులో విభిన్న శైలిలో వినాయక విగ్రహాలు కొలువదీరడానికి గణేష్ మండపాలు సిద్ధమవుతున్నాయి. పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పలుచోట్ల నెలకొలుపుతున్నారు.
ఈసారి కూడా విజయవాడలో నెలకొలుపనున్న గణపతి విగ్రహం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణపతి ఎత్తును మించిపోనుంది. పర్యావరణ హితమైన మట్టితో తయారుచేస్తున్న ఈ గణపతికి కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా నామకరణం చేశారు. కాగితపు మట్టితో తయారయ్యే గణపతి విగ్రహాలు ప్రకృతిలో మమేకమవుతూ మేల, నీరు, చెట్టు, పుట్టాలాంటి ప్రకృతి సత్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతుంది. అందులో భాగంగా మట్టి గణపతిని పూజించడం జరుగుతుంది. కాలక్రమేణా మట్టి గణపతుల స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారైన గణపతి విగ్రహాలు వచ్చేశాయి. వీటితో తయారైన విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించడంతో మళ్ళీ మట్టి విగ్రహాలను పూజించాలన్న వాదం ఊపందుకుంది. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న మట్టి గణపతి ప్రకృతి ఆరాధనను చాటి చెబుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 అడుగుల భారీ గణనాధుని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తుంది డూండి గణేష్ సేవా సమితి. మట్టితో తయారైన గణనాధుడు వినాయక చవితికి సిద్ధమవుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం:
ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో
పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్ వీడియో