ఏపీలో RC అక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పన్లేదు

|

Aug 21, 2023 | 10:04 PM

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు ఇక కార్డు రూపంలో ఉండవు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు తెలిపింది.. ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో పోస్టల్ ద్వారా వారివారి ఇళ్లకు పంపిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కో కార్డుకు 200 రూపాయలు, పోస్టల్ సర్వీస్ కింద మరో 25రూపాయలు తీసుకుని..

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు ఇక కార్డు రూపంలో ఉండవు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు తెలిపింది.. ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో పోస్టల్ ద్వారా వారివారి ఇళ్లకు పంపిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కో కార్డుకు 200 రూపాయలు, పోస్టల్ సర్వీస్ కింద మరో 25రూపాయలు తీసుకుని కార్డులను ప్రజల ఇళ్లకు పోస్టులో పంపించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ పరివార్‌తో అనేక రాష్ట్రాలు ప్లాస్టిక్ కార్డుల స్థానంలో డిజిటల్ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఏపీ కూడా డిజిటల్ బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, రవాణా శాఖ వెబ్‌వెబ్ సైట్ లేదా ఏపీ ఆర్‌టీఏ సిటిజన్, ఈ ప్రగతి, ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువపత్రాలను తీసుకోవాలి. ఏపీ ఆర్‌టీఏ సిటిజన్ ఆండ్రాయిడ్ యాప్‌తోనూ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హై హై నాయకా !! మేకల మందపై కోతి.. గేదెలపై కుక్క సవారీ

ఆ నర్స్‌ వెనుక మరో రూపం.. అతి భయంకరంగా..

మార్కెట్‌లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే

కాలీఫ్లరవ్‌ కట్‌ చేస్తున్న మహిళకు ఊహించని షాక్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆత్మహత్యలను నివారిస్తాయా ?? కోటాలో కొత్త రకం ఫ్యాన్లు