వసంత పంచమి నాడు అక్షరాలు దిద్దిస్తే.. అద్భుతాలు జరుగుతాయా ??
బుధవారం సరస్వతి దేవీ జన్మతిథి పంచమిని పురస్కరించుకుని దేవీ ఆలయాలన్నీ అంగరంగవైభవంగా ముస్తాబయ్యాయి. వసంత పంచమి పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయాలకు పోటెత్తారు. చదువుల తల్లి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు బారులు తీరారు. సరస్వతీదేవిని మాఘ పంచమి రోజు శ్రీపంచమి పేరుతో ఆరాధించడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం.
బుధవారం సరస్వతి దేవీ జన్మతిథి పంచమిని పురస్కరించుకుని దేవీ ఆలయాలన్నీ అంగరంగవైభవంగా ముస్తాబయ్యాయి. వసంత పంచమి పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయాలకు పోటెత్తారు. చదువుల తల్లి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు బారులు తీరారు. సరస్వతీదేవిని మాఘ పంచమి రోజు శ్రీపంచమి పేరుతో ఆరాధించడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి విజ్ఞానవంతులు అవుతారని నమ్మకం. సరస్వతీ దేవి ఆరాధనతో వాక్‌శుద్ధి, జ్ఞానం, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ వంటి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ రోజు వాగీశ్వరీ, మహా సరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణా సరస్వతి, బాల సరస్వతి రూపాల్లో చదువుల తల్లి దర్శనం ఇస్తుంది. వసంత పంచమి వేడుక నేపథ్యంలో బాసరకు భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో కన్నుల పండువగా వసంత పంచమి ఉత్సవాలు జరిగాయి. తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది
Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??
2025 నాటికి భారత్ రానున్న ఫ్లయింగ్ కార్స్ !! ఇంటిపైనే ల్యాండింగ్
PM Surya Ghar Yojana 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు.. కేంద్రం కొత్త పథకం ప్రారంభం