పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ ట్రైన్
భారత్ తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ప్రారంభించారు. హౌరా-కామాఖ్య మార్గంలో ఈ అధునాతన రైలు గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 823 మంది ప్రయాణించే వీలున్న 16 ఏసీ కోచ్‌లతో, ఇది తక్కువ సమయంలో గమ్యం చేరుకునే సౌకర్యం అందిస్తుంది. ఇది భారతీయ రైల్వే రూపురేఖలను మార్చి, ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.
భారత్ లో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. హౌరా-కామాఖ్య మార్గంలో దీన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు హౌరాలో శనివారం సాయంత్రం 6:20కు బయలుదేరి ఆదివారం ఉదయం 08:20కు కామాఖ్య కు చేరుకుంటుంది. ఇందులో మొత్తం 823 మంది ప్రయాణించవచ్చు. రైలులో మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 11 ధర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, మరొక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రీమియం రైలుకు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను, ఫొటోలను రైల్వే శాఖ షేర్ చేసింది. ఎప్పటి నుంచో పరుగులు తీస్తున్న వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్లీపర్ రైళ్ల రాక రైల్వే రూపురేఖల్ని పూర్తిగా మార్చబోతోంది. ప్రయాణికులు కూడా ఈ రైళ్లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. తక్కువ సమయంలోనే గమ్యం చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ లో పరిస్థితి దారుణం.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
Gold Price Today: ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!
వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్ జామ్
గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు