తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. వెంటనే అలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు!

Updated on: Jul 22, 2025 | 5:18 PM

ఐదేళ్ల వయసు దాటిన పిల్లల ఆధార్‌ను వెంటనే అప్ డేట్ చేయాలని, లేదంటే ఆ కార్డు రద్దవుతుందని ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ హెచ్చరించింది.చిన్నారికి ఏడేళ్లు వచ్చినా బయోమెట్రిక్‌ వివరాలు అప్డేట్ చేయకపోయి ఉంటే.. ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులకు, సంరక్షకులకు సూచించింది. ఈ మేరకు యూఐడీఏఐ కీలక ప్రకటన విడుదల చేసింది.

5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ రిమైండర్ లో పేర్కొంది. ఆధార్ నమోదు కేంద్రాలలో ఏడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్డేషన్‌కు రూ. 100 రుసుముతో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఆలస్యం అయితే.. ఆధార్ నంబర్‌ను రద్దు చేయవచ్చని హెచ్చరించింది. బయోమెట్రిక్‌తో కూడిన అప్ డేటేడ్ ఆధార్ వల్ల పాఠశాల అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు నమోదు చేసుకోవడం, స్కాలర్‌షిప్‌ల ప్రయోజనాలను పొందడం, DBT పథకాలు లాంటివి పొందటం సులభమవుతుందని యూఐడీఏఐ వివరించింది. ఏడేళ్లు దాటిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే.. ఆధార్ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది..” అని యూఐడీఏఐ వెల్లడించింది. అలాగే, ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదు కోసం వేలిముద్రలు.. ఐరిస్ బయోమెట్రిక్స్ తీసుకోవటం లేదని కూడా యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశం మీద పిల్లల ఆధార్‌తో అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు.. యూఐడీఏ SMS హెచ్చరికలను పంపుతోంది. అలాగే, 15 ఏళ్ల వయసు నిండినవారికి కూడా రెండవ అప్‌డేట్ కూడా అవసరమేనని కూడా యూఐడీఏఐ తల్లిదండ్రులకు గుర్తు చేసింది. చివరి నిమిషంలో వచ్చే ఇబ్బందులను నివారించడానికి.. ఆధార్-లింక్డ్ సేవలకు అంతరాయం లేకుండా యాక్సెస్ ఉండేలా చూసుకోవడానికి తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని యూఐడీఏఐ ప్రకటనలో తెలిపింది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిర్మల్‌ జిల్లాలో కోడిగుడ్డు బాబా.. ఒకే ఒక్క గుడ్డుతో రోగాలన్నీ మాయం

పొట్ట తగ్గాలా ?? అయితే ఈ పండ్లు తినండి చాలు

చైనా రైల్వే స్టేషన్లలో.. సరకులు మోస్తున్న రోబోలు

వాకింగ్ తర్వాత ఎంతసేపటికి నీరు తాగాలి ??

గంటకు 320 కిలోమీటర్ల వేగం.. భారత్‌లో దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు