UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో అపశృతి.. కూప్పకూలిన కిసాన్ దివస్ వేదిక..!

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. అలీఘర్‌లోని ఇగ్లాస్ పట్టణంలో గురువారం కిసాన్ దివస్ సందర్భంగా రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ సంయుక్త ర్యాలీకి పిలుపునిచ్చారు.

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో అపశృతి.. కూప్పకూలిన కిసాన్ దివస్ వేదిక..!
Election Rally

Updated on: Dec 23, 2021 | 6:33 PM

UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. అలీఘర్‌లోని ఇగ్లాస్ పట్టణంలో గురువారం కిసాన్ దివస్ సందర్భంగా రాష్ట్రీయ జనతాదళ్ సమాజ్‌వాదీ పార్టీ సంయుక్త ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీ కోసం భారీ వేదికను నిర్మించారు. ఈ వేదికపైకి నేతల రద్దీని అదుపు చేయలేకపోవడంతో ఎన్నికల వేదిక కూప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేజీ కూలిపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

వేదిక ఎక్కేందుకు నేతలు ఎంత హడావుడి చేస్తున్నారో వైరల్ వీడియోలో కనిపిస్తోంది. వేదిక ఎక్కేందుకు పెద్ద ఎత్తున నేతలు తరలిరావడం వీడియోలో కనిపిస్తోంది. స్టేజి ఎక్కుతుండగా మెట్లు కిక్కిరిసిపోయాయి. ఇంతలో, నిచ్చెన విరిగిపోయింది. దీంతో నేతలు కిందిపడిపోవడంతో స్పల్పంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన స్థానిక నేతలు ఒక్కొక్కరిని వేదిక పై నుంచి కిందికి దించేశారు.

అయితే, ఈ ర్యాలీకి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా హాజరుకావల్సి ఉంది. భార్య డింపుల్ యాద్ కరోనా నివేదిక పాజిటివ్‌గా రావడంతో, అతను ర్యాలీలు సమావేశాలకు దూరంగా ఉన్నాడు.

అంతకుముందు మీరట్‌లో కూడా ఆర్‌ఎల్‌డి ఎన్నికల వేదిక విరిగిపోయింది. డిసెంబర్ 19న ఫరూఖాబాద్‌లోని కశ్యప్ అధికార సమ్మేళన్ వేదిక కూడా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుహైల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఎస్పీకి చెందిన పలువురు నేతలు గాయపడ్డారు. వేదిక విరిగిపడటంతో పలువురు నేతలకు గాయాలయ్యాయి. ఎస్పీ, సుభాస్ పార్టీ తరపున కశ్యప్ అధికార సమ్మేళనాన్ని మొహదీన్‌పూర్ గ్రామంలో నిర్వహించారు. ఈలోగా ఎన్నికల వేదిక కుప్పకూలింది.

Read Also… PM Modi: ఆవును ఎగతాళి చేసేవారి జీవనోపాధి ఈ పశుసంపద ద్వారానే నడుస్తోంది.. బెనారస్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!