ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్
ఈ సంక్రాంతి పండుగ టాలీవుడ్ హీరోయిన్లకు ఆశించిన విజయాన్ని అందించలేదు. పెద్ద హీరోలున్నా, కొన్ని సినిమాలు కంటెంట్ లేక, మరికొన్ని సరైన టైంలో రాక నిరాశపరిచాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ వంటి తారలు పెద్ద సినిమాలతో వచ్చినా, వారి కెరీర్‌కు పండగ వస్తుందని కలలుగన్నప్పటికీ, నిరాశే ఎదురైంది. సంక్రాంతి హీరోయిన్ల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి.
పండగ సినిమాలు వస్తాయి.. మా కెరీర్‌కు పండగ తీసుకొస్తాయని కలలుగన్న ఆ హీరోయిన్లకు మరోసారి నిరాశే ఎదురైంది. స్టార్ హీరోలున్నా ఉన్నా.. కంటెంట్ లేక ఒకటి.. కరెక్ట్ టైమ్‌లో రాకుండా మరో సినిమా నిరాశ పరిచాయి. ఈ ఎఫెక్ట్ హీరోయిన్ల కెరీర్స్‌పై పడింది. పండగ చేసుకుందామని వచ్చి.. అయ్యో పాపం అయిపోయారు. మరి ఎవరా అన్ లక్కీ పొంగల్ బ్యూటీస్.. సంక్రాంతి హీరోయిన్ల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. గతేడాది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో నటించినా నిధి అగర్వాల్‌కు హిట్ రాలేదు.. పోనీలే పండక్కి ప్రభాస్ వస్తాడు.. అదిరిపోయే హిట్ ఇస్తాడని నమ్మిన నిధికి మరోసారి నిరాశే ఎదురైంది. పండగ సినిమాల్లో రాజా సాబ్ బాగానే నిరాశ పరిచింది. మాళవిక మోహనన్‌ను సైతం రాజా సాబ్ రిజల్ట్ నిరాశ పరిచింది. తెలుగులో తొలి సినిమానే ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వచ్చినా.. మాళవికకు కలిసొచ్చిందేమీ లేదు.. అలాగే నిధి అగర్వాల్ సైతం హిట్ కోసం చూస్తూనే ఉన్నారు. రిద్ధి కుమార్‌కు కూడా సంక్రాంతి కలిసిరాలేదు. ఇక మరో ఇద్దరు బ్యూటీస్ పరిస్థితి ఇలాగే ఉంది.. సంక్రాంతికి రవితేజతో వచ్చి హిట్ కొడదాం అనుకుని.. రేసులో వెనకబడిపోయారు ఆషికా, డింపుల్ హయాతీ. నా సామిరంగాతో హిట్ కొట్టిన ఆషికా రంగనాథ్.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో సెట్ అయిపోదాం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మరోవైపు డింపుల్ సైతం భర్త మీద భారీ ఆశలు పెట్టుకున్నా.. నిరాశ తప్పలేదు. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. పోటీ ఎక్కువగా ఉండటం కలిసిరాలేదు. మొత్తానికి ఈ సంక్రాంతి హీరోయిన్లకు మరికొన్నాళ్లు కష్టాలు కంటిన్యూ అవుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క
2027 సంక్రాంతికి 4 బెర్తులు కన్ఫర్మ్.. ఏ సినిమాలో తెలుసా ??
Tripti Dimri: యానిమల్ బ్యూటీ ఆశలు నెరవేరతాయా ??
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

