2027 సంక్రాంతికి 4 బెర్తులు కన్ఫర్మ్.. ఏ సినిమాలో తెలుసా ??
2026 సంక్రాంతి బాక్సాఫీస్ విజయం తర్వాత, 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే తీవ్ర పోటీ మొదలైంది. పవన్ కళ్యాణ్-అనిల్ రావిపూడి, చిరంజీవి-బాబీ, శర్వానంద్-శ్రీను వైట్ల, తేజ సజ్జ సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ పండగకు మరిన్ని భారీ ప్రాజెక్టులు చేరనున్నాయి. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద యుద్ధం చూడటం ఖాయం.
2027 సంక్రాంతికి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి.. మొన్నొచ్చిన సంక్రాంతి సినిమాలే ఇంకా థియేటర్స్‌లో ఉంటే అప్పుడే నెక్ట్స్ పొంగల్ గురించి చర్చ అంటే కాస్త ఓవర్‌గా లేదూ అనుకుంటున్నారు కదా..? కానీ ఏం చేస్తాం.. పండక్కి క్రేజ్ అలా ఉంది. అందుకే ఏడాది ముందే 4 సినిమాలు లాక్ అయ్యాయి. మరి అవేంటో చూద్దామా..? సంక్రాంతి 2026 అదిరిపోయింది.. ఒకటి రెండూ కాదు ఏకంగా 700 కోట్ల బిజినెస్ జరిగింది. అందులో రాజా సాబ్ వాటా 200 కోట్లు అయితే.. మన శంకరవరప్రసాద్ గారు ఏకంగా 300 కోట్లు కొట్టి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసారు. ఇక శర్వానంద్, రవితేజ, నవీన్ పొలిశెట్టి సినిమాలు మరో 200 కోట్ల వరకు వసూలు చేసాయి. మొత్తానికి చిరు సినిమా అందరికంటే టాప్‌లో ఉంది. గత కొన్ని సంక్రాంతులతో పోలిస్తే ఈసారి పండగ మరింత కళకళలాడింది. అందుకే 2027 సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ మొదలైంది. ఎప్పట్లాగే పండక్కి అల్లుడు వచ్చినట్లు.. వచ్చే పొంగల్‌కు కూడా అనిల్ రావిపూడి ఫిక్స్. హీరో ఎవరో తెలియదు కానీ నెక్ట్స్ సంక్రాంతికి కూడా వస్తానని ప్రకటించారు అనిల్. మోస్ట్‌లీ పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నిస్తున్నారు అనిల్. అన్నీ కుదిర్తే పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ త్వరలోనే చూడొచ్చు. అలాగే చిరంజీవి, బాబీ సైతం వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో ఓసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఈ కాంబో.. మరోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. జనవరిలోనే మెగా 158 ఓపెనింగ్ జరగనుంది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా సంక్రాంతికే రానుందని చెప్పేసారు మేకర్స్. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా సైతం సంక్రాంతి 2027కే రానుంది. ఈ లిస్ట్ ఇప్పటికి కన్ఫర్మ్ అయినవే.. ఇంకా కొత్త సినిమాలెన్ని జాయిన్ అవుతాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: యానిమల్ బ్యూటీ ఆశలు నెరవేరతాయా ??
Oscar: టైటానిక్ రికార్డ్ బ్రేక్ చేసిన సిన్నర్స్
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా.. హీరో అతనే?
పెద్ది సినిమాలో పాట కోసం ట్రెండింగ్ బ్యూటీ.. అబ్బా కుర్రకారుకు గిలిగింతలే
Naveen Polishetty: నాతో సినిమా చేస్తావా.. 15 కోట్లు + కండీషన్స్ అప్లై
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

