అజీర్తికి మామిడిపండుతో చెక్.. తేల్చిన పరిశోధన

|

May 08, 2024 | 1:16 PM

మామిడిపండు పోషకాల గని అనీ మనకు తెలుసు. మామిడిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగాలతో పోరాడే శక్తినిస్తుంది. వీటిలోని విటమిన్లు క్యాన్సర్‌పై పోరాడతాయి. ముఖ్యంగా మామిడిపండులోని ‘‘మాంగి ఫెరిన్’’ రసాయనానికి ఐబీఎస్‌ జీర్ణకోశవాపును తగ్గించే గుణం ఉందని తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెడ్డన్న బృందం పేర్కొంది. వీరి వాదనను బలోపేతం చేసేలా ఎలుకలపై చేసిన పరిశోధనలు సత్పలితాలు ఇచ్చాయని తెలిపారు.

మామిడిపండు పోషకాల గని అనీ మనకు తెలుసు. మామిడిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగాలతో పోరాడే శక్తినిస్తుంది. వీటిలోని విటమిన్లు క్యాన్సర్‌పై పోరాడతాయి. ముఖ్యంగా మామిడిపండులోని ‘‘మాంగి ఫెరిన్’’ రసాయనానికి ఐబీఎస్‌ జీర్ణకోశవాపును తగ్గించే గుణం ఉందని తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెడ్డన్న బృందం పేర్కొంది. వీరి వాదనను బలోపేతం చేసేలా ఎలుకలపై చేసిన పరిశోధనలు సత్పలితాలు ఇచ్చాయని తెలిపారు. మామిడిపండ్లలో ఉండే మాంగిఫెరిన్ రసాయనంతో జీర్ణ వ్యవస్థను చురుగ్గా పని చేసేలా చేయొచ్చని సూచించారు. పోషకాలతో పాటు రుచికి పెట్టింది పేరైన మామిడి పండుతో ఇంకా జీర్ణక్రియకు సహకరించే మేలైన గట్‌ బాక్టీరియా వృద్ధిచెందేలా చేయవచ్చని చెబుతున్నారు. ఈ బృందం జరిపిన పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. మారిన ఫాస్ట్‌ఫుడ్‌ అలవాట్లు జీవనశైలి కారణంగా 1990 నుంచి 2019 మధ్య జీర్ణకోశ వాపు వ్యాధి కేసులు దేశంలో రెట్టింపు నమోదు అయినట్లు ప్రొఫెసర్‌ రెడ్డన్న అన్నారు. చికిత్స తీసుకోని వారిలో ఇది పెద్ద పేగు క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచిందని .. చికిత్సలో భాగంగా మామిడిపండు ఇవ్వడం ద్వారా ‘‘మాంగి ఫెరిన్’’ తో వ్యాధి నయం చేయొచ్చని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాజీ ప్రేయసి ఇంటికి బాంబు పార్సిల్‌ ను పంపిన ప్రియుడు.. ఇద్ద‌రు మృతి

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. కమోడ్ లో పాము బుసలు

అందమైన అమ్మాయిల చెమట తో కలిపి స్నాక్స్ తయారీ.. అదరహో అంటున్న కస్టమర్స్

దారుణం.. సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ప్రసవం..

మీసం, గడ్డం పెంచారని 80 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు