ఆధార్‌ ఇంకా అప్‌డేట్‌ చేసుకోలేదా.. ఇది మీకోసమే వీడియో

Updated on: Oct 04, 2025 | 6:01 PM

ఆధార్ అప్‌డేట్ ఛార్జీలను UIDAI పెంచింది. డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ మార్పులకు ఇప్పుడు అధిక ధరలు చెల్లించాలి. ఇంటి వద్ద ఆధార్ సేవలు మరింత ఖరీదయ్యాయి. అయితే, పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్, కొత్త జనన నమోదు వంటి కొన్ని సేవలు ఉచితంగానే కొనసాగుతాయి. ఈ మార్పులు సెప్టెంబర్ 30, 2028 వరకు అమల్లో ఉంటాయి.

ఆధార్ కార్డు హోల్డర్లకు UIDAI ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆధార్ సేవలకు సంబంధించిన ఛార్జీలను పెంచుతూ UIDAI నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆధార్ అప్‌డేషన్ ఛార్జీలను సవరించడం ఇదే తొలిసారి. తాజా మార్పుల ప్రకారం, ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవడానికి గతంలో రూ.50 ఉండగా, ఇప్పుడు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వేలిముద్రలు, కనుపాప వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ కోసం వసూలు చేసే ఛార్జీని ₹100 నుంచి ₹125కు పెంచారు. ఈ పెంచిన ఛార్జీలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమల్లో ఉంటాయని UIDAI స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో