ఉగాది పంచాంగం 2025: వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ??

Updated on: Mar 29, 2025 | 1:04 PM

మార్చి 29తో అర్ధాష్టమ శని తొలగిపోతున్నందువల్ల కొన్ని కష్టనష్టాల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకో వడం మొదలవుతుంది. మే 18న రాహువు నాలుగవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మే 25 తర్వాత గురువు అష్టమ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా సమస్యాత్మకంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవలసి ఉంటుంది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరు గుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శని గ్రహం చుట్టూ ఉండే రింగ్‌ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా

వేదికపై వధూవరుల ఫోటో సెషన్‌.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి

అసహ్యకరమైన చేప.. చూస్తేనే ఒళ్లంతా వణుకు!

బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??

మారేడు ఫలంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే… అస్సలు వదలరు