ఉగాది పంచాంగం 2025: మీన రాశి వారికి ఈ ఉగాది నుండి కుటుంబపరంగా ఎలా ఉందంటే ??

|

Mar 29, 2025 | 1:19 PM

ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గుతుంది. మే 18న రాహువు వ్యయ స్థానంలోకి రావడం, మే 25న గురువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీగా అంచనాలు, లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉగాది పంచాంగం 2025: కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ??

ఉగాది పంచాంగం 2025: కన్య రాశి వారికి ఈ ఉగాది నుండి ఉద్యోగాల పరంగా ఎలా ఉంటుందంటే ??

ఉగాది పంచాంగం 2025: వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ??

శని గ్రహం చుట్టూ ఉండే రింగ్‌ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా

వేదికపై వధూవరుల ఫోటో సెషన్‌.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి