తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు !! ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచీగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం ఐదున్నర గంటలకు ఈ రైలు బయలుదేరి..
రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచీగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం ఐదున్నర గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 45 నిమిషాలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది. సెప్టెంబరు 24న ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. వీటిల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్చురీకి తరలించిన వ్యక్తిలో కదలికలు !! ఏం జరిగిందంటే ??
చైనాలో సుడిగాలి బీభత్సం !! నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు
మమ్మల్నే పట్టిస్తారా అని తెల్లారేసరికి మాయం చేశారు.. నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు