TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్ పవర్ కాన్ఫరెన్స్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని చెప్పారు.. కానీ ఆయన తిరస్కరించారంటూ వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే కేజ్రీవాల్ స్వాగతించరన్నారు. ఈ సందర్భంగా భగవంత్ మాన్ కాంగ్రెస్ ను నిజాయితీ గల పార్టీగా అంగీకరించడానికి నిరాకరించారు. ఏ పార్టీ నీతి నిజాయితీ లేనిదని, అందులో చేరి ఉన్న వ్యక్తులు ఇలాగే ఉంటారంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అంతేకాకుండా.. టీవీ9 నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ లో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు..
భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…