TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 వేదికగా గ్రాండ్ కాంక్లేవ్.. లైవ్ వీడియో

|

Dec 08, 2024 | 12:41 PM

హాట్‌హాట్‌ డిబేట్స్‌కి మరోసారి వేదికవుతోంది టీవీ9. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ఇవాళ టీవీ9 స్పెషల్‌ కాన్‌క్లేవ్‌కి బడా నేతలంతా రాబోతున్నారు. మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు ఏం చెప్తారు..! దానికి BRS, బీజేపీ లీడర్ల కౌంటర్లు ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాదైంది. మార్పు అనే నినాదంతో పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీని ఓడించి.. అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది పాలనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏడాదిలోనే ఎంతో చేశామని కాంగ్రెస్ వాదిస్తోంది. ఏడాది పాలనకు ప్రతీకగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఏం సాధించారని ఉత్సవాలు చేసుకుంటున్నారని విపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు కేటీఆర్.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Dec 08, 2024 10:21 AM