యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??

|

Nov 05, 2024 | 6:36 PM

మన వంటింట్లో మసాలా పెట్టెలో ఉండే యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయంటున్నారు నిపుణుల. అందుకే ఆయుర్వేద వైద్యంలో యాలకుకలు ప్రముఖ స్థానం ఉంది. మ‌సాలా కూర‌ల‌తోపాటు స్వీట్ల త‌యారీలోనూ యాల‌కుల‌ను వేస్తుంటారు. కొంద‌రు యాల‌కుల‌ను నేరుగానే తింటుంటారు. యాల‌కులు చ‌క్క‌ని సువాస‌న‌ను అందిస్తాయి.

క‌నుక స్వీట్ల‌లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అలాగే కొంద‌రు యాల‌కుల‌ను టీలో వేసి మ‌రిగించి తాగుతారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వాస్త‌వానికి యాల‌కుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా యాల‌కుల‌ను నీటిలో వేసి మ‌రిగించి క‌షాయంలా రోజూ తాగుతుంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌లు వ్యాధులు న‌యం అవుతాయంటున్నారు నిపుణులు. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలో యాల‌కులు ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తాయట. యాల‌కుల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గిపోతుంది. దీంతోపాటు గ్యాస్‌, అజీర్తి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుందని చెబుతున్నారు. యాల‌కులు చ‌క్క‌ని వాస‌న వ‌స్తాయి. అందువ‌ల్ల యాల‌కుల నీళ్ల‌ను నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. ఈ పానీయాన్ని మౌత్ ఫ్రెష‌న‌ర్‌గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. యాల‌కుల నీళ్ల‌ను రోజూ తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో కొవ్వు క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారికి యాల‌కుల నీళ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి.యాల‌కుల నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాల‌కుల నీటిలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. దీని వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి యాల‌కులు ఒక వ‌ర‌ంగా చెబుతున్నారు నిపుణులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు

ఆ ఊరిలో 70 ఏండ్ల నుంచి దీపావళి నిషేధం.. ఎందుకో తెలుసా ??

నల్ల గేదెకు తెల్ల దూడ పుట్టదా ??

రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!

ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం !! చివరికి ఏమైందంటే ??

Follow us on