చిల్గోజా నట్స్ తెలుసా ?? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
డ్రైఫ్రూట్స్ అనగానే బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాలు, వాల్‌నట్స్ ఇలాంటివి ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇవే కాకుండా జీడిపప్పు, బాదం పప్పు లాగే చిల్గోజా కూడా ఓ డ్రై ఫ్రూట్. దీనిని పైన్ నట్ అని కూడా అంటారు. ఈ పండు విత్తనాల్ని డ్రై ఫ్రూట్‌గా వాడతారు. తియ్యగా ఉండే ఈ నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు .
చలికాలంలో వీటిని తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు. చలికాలంలో చిల్గోజా గింజలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన వెచ్చదనం దొరుకుతుంది. అలాగే ఎముకలు దృఢంగా మారతాయి. చిల్గోజా గింజల్ని ఫేస్ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. పైన్ గింజల్ని పొడిచేసి సమాన పరిమాణంలో బియ్యం పిండిని కలిపి పేస్ట్‌లా చేసి స్క్రబ్‌లా అప్లై చేయాలి. దీంతో చర్మం లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. చిల్గోజా గింజల్లో కాటెచిన్, లుటిన్, లైకోపీన్, కెరోటినాయిడ్స్, టెకోఫెరాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్