Betel Leaf: తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు

Updated on: Mar 07, 2025 | 8:32 PM

హిందూ సంప్రదాయంలో తమలపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా తమలపాకు ఉండి తీరాల్సిందే. తమలపాకును లక్ష్మీప్రదంగా భావిస్తారు. తమలపాకులు ఇంట ఉంటే ధనానికి లోటు ఉండదని నమ్ముతారు. ఇక ఆరోగ్యపరంగానూ తమలపాకు ఎంతో విశిష్టమైనది. ఇందులో ఎన్నో ఔషధా గుణాలు ఉన్నాయని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

తమలపాకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తమలపాకులను నీళ్లలో వేసి మరిగించి తీసుకోవడం వలన మన శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తమలపాకు కషాయం తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరం. తమలపాకులతో మరిగించిన నీటిని తాగడంవల్ల శరీరాన్ని విషరహితం చేస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం.. కారణం ఇదే

వీడిన బర్డ్ ఫ్లూ భయం.. చికెన్‌ షాపుల దగ్గర భారీగా క్యూ

తాడేపల్లిలో వింత జంతువు ప్రత్యక్షం.. దాన్ని చూసి భయపడిన స్థానికులు

ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?

100 రోజుల్లో ప్రెగ్నెంటే టార్గెట్ ! నవ్విస్తూనే.. ఆలోచింపచేస్తున్న టీజర్