Top 9 ET: మహేష్‌కు అది తలకు మించిన భారమే!.. అంతా చిరు నోటి చలవే..

| Edited By: Rajeev Rayala

Mar 06, 2024 | 12:34 PM

యంగ్ డైరెక్టర్లకు చిరు సెంటిమెంట్‌గా మారుతున్నారా? చిరు నోటి చలువ వల్ల కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయా? చిరు దీవెన ఉంటే చాలు.. ఓ సినిమా మినిమం గ్యారెంటీ రిజెల్ట్ తెచ్చుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు హనుమాన్ రిజెల్ట్ చూసిన కొంతమంది నెటిజన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు చెప్పిన మాటలతో ఈ సినిమా రీచ్ మరింత పెరిగిందని.. ఆ సినిమాపై తెలియని పాజిటివ్ వైబ్ వచ్చిందని నెట్టింట చెబుతున్నారు. ఇది కూడా ఆ సక్సెస్ అవ్వడానికి ఒక కారణం అని.. మేకర్స్ కూడా ఫీలవుతున్నారు.

లాజిక్‌ ఉన్నా లేకున్నా… ఫిల్మ్ సెలబ్రిటీలకు కొన్ని కొన్ని నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలే తమను తమ కెరీర్లో సక్సెస్ అయ్యేలా చేస్తాయనే థాట్స్‌ ఉంటాయి. ఇక యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అలాంటి ఓ నమ్మకమే ఉంది. అదే 9. ఎస్ ! 9 నెంబర్‌ తనకు బాగా కలిపివస్తుందనే నమ్మకం యంగ్ టైగర్‌లో ఉంది. తాతకు కూడా ఇదే నెంబర్‌ పై నమ్మకం ఉండడం.. తన నాన్నకు కూడా ఈ నెంబర్‌ అంటే ఇష్టం కావడంతో.. తను కూడా నైన్ నెంబర్‌ను బలంగా నమ్ముతారు తారక్. తన కార్‌తో పాటు.. ట్విట్టర్ హ్యాండిల్ యూజర్ నేమ్‌లో కూడా 9 నెంబర్ ఉండేలా చూసుకున్నారు ఈయన. నో డౌట్‌ మహేష్ ఈజ్ ట్రూ పెర్ఫార్మర్. కానీ జక్కన్న హార్డ్‌ టేకింగ్‌కు మహేష్ తట్టుకోగలరా..? అనే డౌట్ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోనూ ఉంది. దానికితోడు.. ఈ సినిమా షూటింగ్‌కే 3 సంవత్సరాలు పట్టడం.. అ సినిమాలో దాదాపు 8 గెటప్స్‌లో మహేష్‌ కనిపించాల్సి రావడం కూడా మహేష్‌ కు కష్టంగా మారనుంది అనే కామెంట్ నెట్టింట వస్తోంది. ఎంతైనా జక్కన్న సినిమా.. ఎప్పుడూ కంఫర్ట్‌ జోన్‌లో ఉంటే మహేష్‌కు తలకు మించిన భారమే అని అంటున్నారు కొంత మంది నెటిజన్లు.

యంగ్ డైరెక్టర్లకు చిరు సెంటిమెంట్‌గా మారుతున్నారా? చిరు నోటి చలువ వల్ల కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయా? చిరు దీవెన ఉంటే చాలు.. ఓ సినిమా మినిమం గ్యారెంటీ రిజెల్ట్ తెచ్చుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు హనుమాన్ రిజెల్ట్ చూసిన కొంతమంది నెటిజన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు చెప్పిన మాటలతో ఈ సినిమా రీచ్ మరింత పెరిగిందని.. ఆ సినిమాపై తెలియని పాజిటివ్ వైబ్ వచ్చిందని నెట్టింట చెబుతున్నారు. ఇది కూడా ఆ సక్సెస్ అవ్వడానికి ఒక కారణం అని.. మేకర్స్ కూడా ఫీలవుతున్నారు. దీంతో అప్‌కమింగ్ డైరెక్టర్స్ చిరుతో తమ సినిమాను లాంచ్‌ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు.

భర్త ఎంత పెద్ద స్టార్‌ అయినా.. భార్యకు మాత్రం భర్తే కదా! చెప్పింది చేయాల్సిందే కదా..! అందుకే అన్నట్టు తన భర్తతో రీసెంట్‌గా సేవ చేయించుకుంటూ కనిపించిన ఉపాసన నెట్టింట వైరల్ అయ్యారు. అయితే భార్య సేవలోనే కాదు.. కూతరు ఆలనాపాలనకు కాస్త టైం కేటాయించారట చరణ్. తన కూతురి డైపర్ ఛేంజ్ చేయడం.. స్నానం చేయించాక రెడీ చేయడం వంటివి తనే చేస్తున్నారట. తన బుజ్జి తల్లికి సేవ చేస్తూ మురిపోతున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Mar 05, 2024 10:07 PM