Tirumala: తిరుమలకు ప్లాన్ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక! మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయబడుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 వరకు ఆలయం మూసి ఉంటుంది. ఈ సమయంలో అష్టదళపాద పద్మారాధన, కల్యాణోత్సవం వంటి ఆర్జిత సేవలు రద్దు. దర్శనం రాత్రి 8:30 నుండి పునఃప్రారంభమవుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
తిరుమల టూర్‌కు ప్లాన్‌కు చేసుకుంటున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్ ఇది. మార్చిలో తిరుమల ఆలయం మూసివేయనున్నారట. మార్చి 3న దాదాపు పదిన్నర గంటల పాటు శ్రీవారి ఆలయంలో అన్ని సేవలకు రద్దు చేస్తామని టీటీడీ ప్రకటించింది. చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. చంద్రగ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. దీంతో తిరుమల ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుమారు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు పేర్కొన్నది. భక్తులకు శ్రీవారి దర్శనం 8:30 గంటల నుంచి పునః ప్రారంభమవుతుందని వివరించింది. చంద్రగ్రహణం కారణంగా అష్టదళపాద పద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్టు వెల్లడించింది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఎనిమిదిన్నర గంటల తర్వాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాదపద్మారాధన సేవ, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకర సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్ పోస్ట్
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి
