Murder: ఢిల్లీ ఘటన మరవకముందే మరో శాడిస్ట్.. ప్రియురాలిని హోటల్‌కి పిలిచి చంపి సోషల్‌మీడియాలో వీడియో.!

Updated on: Nov 21, 2022 | 9:01 AM

ఢిల్లీ ఘటన మర్చిపోకముందే మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. పరాయి వ్యక్తితో ప్రియురాలు రొమాన్స్ చేస్తుందని.. హత్య చేసి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు ఓ శాడిస్ట్‌.


గుజరాత్‌కు చెందిన వ్యాపారి అభిజిత్.. అదే ఏరియాకు చెందిన ఓ యువకుడిని బిజినెస్‌ పార్టనర్‌గా పెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌కి చెందిన శిల్పా అనే యువతితో అభిజిత్‌కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తరువాత అభిజిత్, శిల్ప దగ్గరయ్యారు. ప్రియురాలు శిల్పాతో అభిజిత్ విహార యాత్రలకు వెళ్లి జల్సాలు చేసి వచ్చేవాడు. కొంత కాలం తరువాత అభిజిత్‌ స్నేహితుడుని శిల్ప లైన్‌లో పెట్టింది. అభిజిత్‌లో డేటింగ్‌,..స్నేహితుడితో విహార యాత్రలు చేసేది. అంతేకాదు అభిజిత్‌ దగ్గర తీసుకున్న 12లక్షల రూపాయలు అతని స్నేహితుడికి ఇచ్చి ఇద్దరు ఎంజాయ్‌ చేయడం మొదలెట్టారు. ఈ విషయం తెలిసిన అభిజిత్‌.. శిల్పపై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా ఖతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే జబల్ పూర్ వెళ్లాడు. ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని అక్కడికే శిల్పాను పిలిపించుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం గొంతు కోసి చంపేశాడు. హత్య చేసేటప్పుడు ఫోటోలు, వీడియో తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. హత్య తరువాత పరారైన అభిజిత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 21, 2022 09:01 AM