Harish Rao: హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్.. కవిత వ్యాఖ్యలపై స్పందించిన పార్టీ
క్రిస్టల్ క్లియర్.. కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. హరీష్‌రావుపై కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. కవిత వ్యతిరేకంగా గులాబీ పార్టీ హరీష్‌రావుకు అండగా నిలిచింది. హరీష్ ఆరడుగుల బుల్లెట్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఆ వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ....
కవితకు ట్విస్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మొన్నటివరకు కవిత ఏం మాట్లాడినా లైట్ తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సీరియస్‌గా స్పందించింది. బీఆర్ఎస్ అధినేత కూతురు కావడంతో కవిత ఏం మాట్లాడినా చూసీ చూడనట్టు వ్యహరించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు మీద కవిత తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై పార్టీ రియాక్ట్ అయింది.
హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కవిత.. హరీష్ రావును విమర్శించిన నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా స్పందించింది గులాబీ పార్టీ. హరీష్ రావును ఆకాశానికి ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అని పోస్ట్ చేసింది. హరీష్ రావుకు ఫైర్ సింబల్ పెట్టింది.
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని హరీష్ రావు సింహంలా సింగిల్‌గా ఎదుర్కొన్నారంది BRS పార్టీ. అసెంబ్లీలో హరీష్‌రావు పోరాటాన్ని ఫైర్‌గా అభివర్ణించింది పార్టీ. మరోవైపు కవితపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కవిత PROని పార్టీ గ్రూప్ నుంచి తొలగించారు. సోషల్ మీడియాలో కవితను.. పార్టీ క్యాడర్ అన్ ఫాలో చేస్తోంది.
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

